Pushpa 2: కోట్లకు కోట్లే.. ‘పుష్ప 2’ ఆల్ టైం రికార్డ్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2: ది రూల్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు వున్నాయి. అందుకు నిదర్శనమే.. లేటెస్ట్ బిజినెస్ లెక్కలని చెప్పొచ్చు. పుష్ప2తో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు బన్నీ.
Pushpa 2: Crore to crore.. 'Pushpa 2' all time record?
Pushpa 2: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో వచ్చిన పుష్ప1: ది రైజ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులో పెద్దగా ఆడకపోయినా.. నార్త్ ఇండియాలో మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు పుష్పరాజ్. బన్నీ మాసివ్ యాక్టింగ్‌కు బ్రహ్మరథం పట్టారు ఆడియెన్స్. బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది పుష్ప పార్ట్ 1. దీంతో పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానికి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ రైట్స్ కోసం ఏకంగా 200 కోట్లు అనిల్ తడానీ చెల్లించినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో ఇంతకుమించిన బిజినెస్ డీల్ జరగలేదు. దీంతో.. పుష్ప 2 రికార్డు సృష్టించిందని అంటున్నారు. ఇదిలా ఉండగానే.. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపుగా 275 కోట్ల డీల్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ.. పుష్ప 2 రైట్స్ అమ్ముడుపోవడం ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు పుష్ప 2 నుండి మరొక టీజర్ ని రిలీజ్ చేసేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెకండ్ టీజర్లో యాక్షన్ సీన్స్‌తో పాటు డైలాగ్స్ కూడా ఉంటాయట. ఫస్ట్ టీజర్‌ను కేవలం జాతర సెటప్, బన్నీ అమ్మవారి గెటప్‌తోనే కట్ చేశాడు సుకుమార్. అందుకే.. ఇప్పుడు మరో టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా.. పుష్ప2 క్రేజ్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.