HNK: దామెర మండలం పసరగొండ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తోందని విమర్శించారు.