ADB: భీంపూర్ మండలంలోని కరంజి (టి) గ్రామంలో మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు గురువారం పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.