KRNL: కర్నూలు డైట్ (TTC) ప్రభుత్వ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాల(D) మిడుతూరు మండలం చింతలపల్లికి చెందిన చంద్రకళ(17) కాలేజీ హాస్టల్ గదిలో కిటికీకి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఈ ఘటనతో విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.