E.G: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ శరద్ గోవిందరావు పహార్తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శరద్ పవార్ 85వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడైన ఆయన, నేను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు నాకు గొప్ప మద్దతుగా నిలిచారని పురందేశ్వరి కొనియాడారు.