కృష్ణా: తమిరిస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల భద్రతపై శక్తి టీం ఇవాళ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ సోమేశ్వరరావు మాట్లాడుతూ.. బాలికలకు బ్యాడ్ టచ్ ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో, సైబర్ నేరాలకు బలికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.