»Nikki Haley Wins Republican Primary In First Victory Over Donald Trump
US elections : ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌పై నిక్కీ హేలీ తొలి విజయం
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీలు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగా నిక్కీ హేలీకి తాజాగా తొలి గెలుపు దక్కింది.
Nikki Haley First Primary Win : ఎట్టకేలకు నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్‌పై తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీలు పోటీ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆదివారం జరిగిన డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ గెలుపొందారు.
డొనాల్డ్ ట్రంప్(Donald Trump)ని దాటి నిక్కీ ఆధిక్యంలోకి రావాలంటే మంగళవారం జరిగే పలు ప్రైమరీ ఎన్నికల్లో కూడా నిక్కీ భారీ తేడాతో వరుస విజయాలు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల సొంత రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆమె పరాజయం పాలయ్యారు. దక్షిణ కరోలినా ఆమె సొంత రాష్ట్రం. అయినప్పటికీ అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి వైదొలగడానికి ఆమె అంగీకరించలేదు.
ఏదేమైనప్పటికీ ట్రంప్‌కి ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ హేలీ(Nikki Haley) ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆమె మరిన్ని చోట్ల విజయాలు సాధిస్తానని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిక్కీ వికిజయం సాధించిన డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట. అక్కడ నమోదిత రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్ తమ పార్టీ ప్రైమరీలో 92 శాతం ఓట్లు సాధించారు.