»Donald Trump Has Defeated Nikki Haley In His Home State For The Us Presidential Nomination
Donald Trump: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీని ఓడించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షపదవి బరిలో డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ నిలిచేలా ఉన్నారని తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే అభ్యర్థిత్వ పోటీలో జోరుమీదున్న ట్రంప్ తాజాగా నిక్కీ హేలీ సొంత రాష్ట్రంలో కూడా విజయం సాధించారు.
Donald Trump has defeated Nikki Haley in his home state for the US presidential nomination
Donald Trump: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోరు కొనసాగిస్తున్నారు. దక్షిణ కరోలినా (South Carolina) రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించారు. సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ(Nikki Haley)పై ట్రంప్ గెలిచారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు 63 శాతం ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీకి 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటికే న్యూ హాంప్ షైర్, నెవడా, ఐయోవా, వర్జిన్ ఐలాండ్స్‌లో విజయం సాధించి ముందంజలో ఉన్నారు. ఈ దూకుడు చూస్తుంటే అధ్యక్ష బరిలో ట్రంప్ నిలిచేలా కనిపిస్తుంది. కానీ నిక్కీ హేలీ మాత్రం తగ్గేదే లే అంటుంది.
రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత సంతతికి చెందినది అన్న సంగతి తెలిసిందే. ఆమె గతంలో రెండుసార్లు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. అయితే తాజా ఎన్నికల్లో తన సొంత రాష్ట్రంలోనే ఓడిపోవడంతో అధ్యక్ష రేసులో ట్రంప్ అభ్యర్థిత్వం ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు నిక్కీ హేలీని పోటీనుంచి తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తుంది. అయినప్పటికీ హేలీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 5న జరగబోయే స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.