NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కలెక్టర్ సంతోశ్ స్వాగతం పలికారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. హెలికాప్టర్లో వచ్చిన సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. సీఎం వెంట పలువురు మంత్రులు ఉన్నారు.