ఉక్రెయిన్పై రష్యా దాడుల తీవ్రతను మరింత పెంచింది. శుక్రవారం 500 కేజీల భారీ గ్లైడ్ బాంబును ప్రయోగించింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతిచెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. 50 దుకాణాలు, 13 నివాస భవనాలు ధ్వంసమైనట్లు సమాచారం. అంతకుముందు గురువారం మాస్కోను లక్ష్యంగా చేసుకుని కీవ్ 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. వీటిని సమర్థంగా కూల్చేసినట్లు రష్యా వెల్లడించింది.