రంగారెడ్డి: అమనగల్ మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో రేపు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అమనగల్, మాడుగుల, కడ్తాల్, తలకొండపల్లి మండలాలకు సంబంధించి ఎంపిక చేసిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.