సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం కోవెలగుట్టపల్లి గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.