HYD నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో వారం రోజుల వర్షం ఒకటేసారి పడినట్లయింది. నేడు మారేడుపల్లి కంటోన్మెంట్ ఏరియాలో ఏకంగా 114.3 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి 113, నాచారం 101, మలక్పేట 98, అడ్డగుట్ట 97, ఇందిరానగర్ 96, ఉస్మానియా యూనివర్సిటీలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. నిన్న సైతం అనేక చోట్ల 90 మిల్లీమీటర్లకు పైగా నమోదైంది.