HYD: హైదరాబాద్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు పోటెత్తింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా మంది మెట్రో రైల్ వైపు మొగ్గు చూపారు. దీంతో మెట్రో స్టేషన్లు అన్ని రద్దీగా మారాయి.