National Tourism Day 2024: జాతీయ పర్యాటక దినోత్సవం 2024 నేపథ్యం, థీమ్
జాతీయ పర్యాటక దినోత్సవం, ఏటా జనవరి 25న జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం జాతీయ పర్యాటక దినోత్సవం థీమ్ మారుతుంది. ఈ ఏడాది 2024కు ఏ థీమ్ ఏంటీ, అలాగే దాని చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
National Tourism Day 2024: జాతీయ పర్యాటక దినోత్సవం, ప్రతీ సంవత్సరం జనవరి 25న జరుపుకుంటాము. ఇది ప్రయాణ స్ఫూర్తిని తెలియజేస్తుంది. ఈ రోజు ప్రజలను వారి స్వంత దేశాలలో ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించమని ప్రోత్సహించడమే కాకుండా, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక దేశంలో ఉన్న సాంస్కృతిక, చారిత్రక, సహజ అద్భుతాలను కొనియాడాలని, ఇతర దేశాల భౌగోళిక, సంస్కృతిక అద్భుతాలను గౌరవించాలని జాతీయ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తారు. చాలా మంది ప్రపంచాన్ని చుట్టి రావాలను కుంటారు కానీ, తమ రాష్ట్రంలో, తమ దేశంలో ఉన్న ప్రదేశాలను మరిచిపోతారు. అలాంటి అద్భుత దృష్యాలను గుర్తుచేసేందుకే ఏటా ఈ దినోత్సవం నిర్వహిస్తారు.
జాతీయ పర్యాటక దినోత్సవం 2024 థీమ్, “స్థిరమైన ప్రయాణాలు, వన్నె తగ్గని జ్ఙాపకాలు”. మనం ప్రయాణాన్ని ఒక అందమైన జ్ఙాపకంగా మార్చుకునేందుకు ఈ థీమ్ దిక్సూచిగా పనిచేస్తుంది. ప్రపంచాన్ని మరింత బాధ్యతాయుతమైన అన్వేషణ వైపు ఔత్సాహికులను ప్రేరేపించడానికి ఈ థీమ్ ఉపయోగపడుతుంది. “సస్టైనబుల్ జర్నీస్” అనేది పర్యాటకంతో పాటు పర్యావరణ అవగాహన కల్పిస్తుంది. స్థానికంగా పచ్చదనం పెంపొందేలా చూసుకోవడం, స్థానిక పరిరక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంతో పాటు కార్బన్ తయారి వస్తువులను తగ్గించడం గురించి చెబుతుంది. “టైమ్‌లెస్ మెమోరీస్” ప్రయాణికులు మనుసులు ఉప్పొంగే ప్రదేశాలను గుండెల్లో బంధించాలని, ప్రయాణాలు చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదనే భావాన్ని పెంపొందిస్తుంది.
యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) స్థాపనతో 1970 సంవత్సరంలో జాతీయ పర్యాటక దినోత్సవం ప్రారంభమయ్యాయి. ప్రపంచ అవగాహనను పెంపొందించడంలో పర్యాటకం కీలక పాత్రను గుర్తిస్తూ, ప్రయాణం మాత్రమే కాకుండా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువల గురించి అవగాహన పెంచడం కోసమే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామి. వీటి ద్వారా ఒక దేశానికి మరో దేశానికి మంచి సంబంధాలు బలపడుతాయి. టూరిజం బలంగా అభివృద్ధి చెందితే ఆ దేశం ఆర్థికంగా కూడా బలపడుతుంది.