Republic Day 2024: 75వ గణతంత్ర దినోత్సవం.. ఛీఫ్ గెస్ట్, థీమ్, ప్రత్యేకతలు?
75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీ ముస్తాబు అవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులు గణతంత్ర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సంవత్సరం ముఖ్య అతిథి ఎవరు వస్తున్నారు, థీమ్ ఏంటి అనేది తెలుసుకుందాం.
Republic Day 2024: ప్రతీ సంవత్సరం జనవరి 26న దేశమంతా గణతంత్ర వేడుకలు (Republic Day 2024) ఘనంగా జరుపుకుంటారు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతీ ఏటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు భారతదేశ ప్రథమ పౌరులు రాష్ట్రపతి ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం రాష్ట్రపతిగా ఉన్నా ద్రౌపది ముర్ము అధ్యక్షతన రెండు రోజులపాటు అట్టహాసంగా ఈ గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకతో ముగుస్తాయి.
ఒక్క సారి గణతంత్ర దినోత్సవ నేపథ్యానికి వెళ్తే.. ఆగస్టు 15 1947 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. తరువాత దేశంలోని చట్టాలు, శాసనాలు, పరిపాలన, న్యాయం సంబంధిత నిబంధనలు రాయడానికి డా. భీమ్ రామ్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పడింది. వారి సారథ్యంలో అతిపెద్ద లిఖిత పూర్వక భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మేదావులు రాశారు. దాన్ని రజ్యాంగా సభ అధ్యక్షడు బాబు రాజేంద్ర ప్రసాద్‌కు సమర్పించగా, రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ప్రతీ సంవత్సరం ఈ వేడుకకు వివిధ దేశాలకు చెందిన అధ్యక్షలు హాజరు అవుతారు. ఈ సంవత్సరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు ఆహ్వానం అందింది. దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. గతేడాది ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరరైయ్యారు. అలాగే ఈ సంవత్సరం 2024 రిపబ్లిక్ డే థీమ్ ”India – Mother of Democracy”, ”విక్షిత్ భారత్” (అభివృద్ధి చెందిన భారతదేశం) అని అర్థం.