భారత్ 75వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాల శకటాలు పరేడ్‌లో ఆకట్టుకున్నాయి.
Republic Day: భారత్ 75వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాల శకటాలు పరేడ్‌లో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో భాగంగా 1500 మంది మహిళలు వందే భారతం నృత్య ప్రదర్శన నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. 1500 కలిసి మొత్తం 30 రకాల జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే జీ20 ఇతివృత్తంతో విదేశాంగ శాఖ శకటాన్ని ప్రదర్శించింది. జీ20 కూటమి లోగో, సభ్య దేశాల జెండాలతో కూడిన శకటాన్ని రూపొందించింది. మహిళల నాయకత్వంలో అభివృద్ధి అనే నినాదం ఇచ్చింది.
చంద్రయాన్-3 విజయం ఇతివృత్తంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శకటం ప్రదర్శించింది. వికసిత్ భారత్ థీమ్‌తో సీఎస్ఐఆర్ రోబో శకటం ప్రదర్శించింది. మణిపుర్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రంలో 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఇమా కెయితల్ మార్కెట్‌ను ప్రదర్శించారు. దీన్ని పూర్తిగా మహిళా వికేత్రలే నడుపుతారు. ప్రపంచంలో మహిళలు నిర్వహిస్తున్న అతిపెద్ద మార్కెట్ ఇదే కావడం విశేషం. ఉత్తరప్రదేశ్ శకటంలో రామ్ లల్లా చిత్రం ఆకట్టుకుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రజా పనుల విభాగం శకటంలో నూతన పార్లమెంట్ భవనం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ప్రదర్శించారు.
VIDEO | Republic Day Parade: Indian Space Research Organisation (ISRO) tableau rolls on at the Kartavya Path. The tableau depicts the successful soft landing of Chandrayaan-3 on the Moon near south pole.@isro#RepublicDay2024#RepublicDayIndiapic.twitter.com/2LyCyKX6T7