USA: నైట్రోజన్ గ్యాస్‌తో ఖైదీకి తొలిసారి మరణ శిక్ష
ప్రపంచంలో తొలిసారి ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్షను అమలు చేయనున్నారు. అమెరికాలెని అలబామా రాష్ట్రంలో యూజీన్ స్మిత్ చార్లెస్ భార్యను హత్య కేసులో దశాబ్దాలుగా జైలు జీవితం గడుపుతున్న అతనికి ఈ తరహాలో మరణశిక్షను అమలు చేయనున్నారు.
USA: ప్రపంచంలో తొలిసారి ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్షను అమలు చేయనున్నారు. అమెరికాలెని అలబామా రాష్ట్రంలో యూజీన్ స్మిత్ చార్లెస్ భార్యను హత్య కేసులో దశాబ్దాలుగా జైలు జీవితం గడుపుతున్నారు. 1982లో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో మరణ దండన అమలు చేయగా.. ఇప్పుడు నైట్రోజన గ్యాస్‌తో ఈ మరణ శిక్ష విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి. ఈ పద్ధతిలో నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే ఆక్సిజన్ అందక ఖైదీ అపస్మారక స్థితిలోకి జారి మరణిస్తాడు. నైట్రోజన్ మోతాదు అధికంగా ఉండటంతో ఆక్సిజన్ అందక దోషి బాధను అనుభవిస్తూ మరణిస్తాడు. ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా కాపాడతారో.. నైట్రోజన్ ద్వారా ఆ ప్రాణాల్ని చంపేస్తారు.
చార్లెస్ సెన్నెట్ అనే వ్యక్తి తన భార్య ఎలిజబెత్‌ను చంపేందుకు విలియమ్స్‌కు సుపారీ ఇచ్చాడు. విలియమ్స్.. స్మిత్, పార్కర్లను సంప్రదించి చార్లెస్ భార్యను హత్య చేశారు. భయంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు విషయంలో విలియమ్స్‌కు యావజ్జీవ శిక్షపడగా.. అనారోగ్యంతో 2020లో జైల్లో మరణించాడు. స్మిత్, పార్కర్‌కు కూడా మరణశిక్ష పడింది. ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేయాలని భావించారు. అయితే పార్కర్ ఈ ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా చనిపోగా.. స్మిత్‌కు ఈ ప్రయత్నం విఫలమైంది. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపివేశారు. ఇంతో అలబామా కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసింది. ఇప్పుడు నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో మరణ శిక్షను అమలు చేస్తున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్మిత్ కుటుంబ సభ్యులు కూడ క్షమాభిక్ష కోరారు. వీటిన్నింటిని న్యాయస్థానం తోసి పుచ్చింది. యూజీన్ స్మిత్‌కు మరణశిక్ష విధించింది.