»Pawan Kalyan These Are The Two Places That Will Be Contested
Pawan Kalyan: పోటీ చేసే రెండు స్థానాలు ఇవే!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుంది.
Pawan Kalyan: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ రెండు స్థానాలు ఏవో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించినందున రెండు స్థానాలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్నికల గురించి మాట్లాడారు.
టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ పార్టీతో కలిస్తే బలవంతులమవుతామని తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుంది. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తెలుసని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్‌కు ఊరంతా శత్రువులే. ఆయనపై వ్యక్తిగత కక్ష లేదన్నారు. వైసీపీ నేతలకు కష్టమొస్తే నా వద్దకు రండి అని పవన్ కల్యాణ్ తెలిపారు. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదన్నారు.