బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేయనున్నాడట. ఇప్పటికే బన్నీకి దర్శకుడు కథను వినిపించగా.. ఆయన ఇంట్రెస్ట్ చూపించినట్లు సమాచారం. అయితే ‘పుష్ప 2’ సమయంలోనే వీరిద్దరి మధ్య కథ చర్చలు జరిగినట్లు, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు టాక్. ఇది సెట్స్ మీదకు వెళ్లేందుకు రెండేళ్ల టైం పడుతుందట.