తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు అనవసరమని అన్నారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని చెప్పిన ట్రంప్.. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు తెలిపారు.