ATP: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న జిల్లా మహిళల కోసం అంబికా ఫౌండేషన్, దగ్గుపాటి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నెల 11న అనంతపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. నగరంలోని మహర్షి వాల్మీకి భవన్లో ఉదయం 9 గంటలకు ఈ మేళా ప్రారంభం కానుంది. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18-30 ఏళ్ల మహిళలు అర్హులని నిర్వాహకులు తెలిపారు.