WGL: నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని శుక్రవారం పశు వైద్యాధికారి డా.వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు గ్రామంలోని తమ పశువులకు టీకాలు వేయించారు. సమయానికి టీకాలు వేయించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని డాక్టర్ వివరించారు.