AP: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సత్కరించి అభినందించారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెకు మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళల ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో శ్రీచరణి సత్తా చాటిన విషయం తెలిసిందే.