KRNL: హాలహర్వి మండలం సిద్దాపురం గ్రామంలో శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. భీమేష్, శాంతమ్మ దంపతుల 12 ఏళ్ల కుమారుడు సోమశేఖర్, బోరు నీటి మోటార్ ఆన్ చేయగా విద్యుదాఘాతానికి గురై అయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.