VSP: అక్రమంగా రేషన్ బియ్యం మిల్లులో నిల్వ చేయడంతో భీమిలి RDO అనందపురం ఎమ్మార్వో శుక్రవారం ఓ మిల్లును సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నారనన్న ఫిర్యాదులతో పెద్దిపాలెంలోని 3 రైస్ మిల్లుల పై తనిఖీలు చేపట్టగా ఓ మిల్లులో బియ్యం నిల్వలు గమనించారు. దీంతో క్రిమినల్ కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.