తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లోనే ఉంచుతుంటారు. కానీ అలా చేయకండి. మీ పిల్లలను క్రీడలు ఆడించండి. వారు అథ్లెట్లుగా ఎదగకపోవచ్చు కానీ.. క్రమశిక్షణ, స్థిరత్వం, ఇతరులతో కలిసి సమన్వయంతో పనిచేయడం నేర్చుకుంటారు. కఠిన పరిస్థితుల్లోనూ సహనంతో వ్యవహరించడం, శ్రమను గౌరవించడం అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లలను మైదానాల్లోకి పంపించండి.