Blood Cancer: బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ బాలుడిని గంగానదిలో ముంచితే నయం అవుతుందనే మూఢనమ్మకం బాలుడిని బలి చేసింది. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని భావించిన ఓ మహిళ ఆ బాలుడిని నీటిలో కొంతసేపు ఉంచింది. ఆ తర్వాత బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన ఓ అయిదేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కానీ క్యాన్సర్ ముదిరిందని, ఇక బాలుడు బ్రతకడం కష్టమని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే ఆ బాలుడిని గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని అతని అత్త నమ్మింది.
ఆ బాలుడితో పాటు తల్లిదండ్రులను తీసుకుని హరిద్వార్‌కు తీసుకొచ్చింది. తల్లిదండ్రులు గంగానదికి పూజలు చేస్తుండగా.. ఆ చల్లని నీటిలో బాలుడిని అత్త ముంచింది. దాదాపు 15 నిమిషాల పాటు నీటిలోనే వదిలేసింది. దీనిని గమనించిన స్థానికులు ఆమెను నిలదీశారు. ఆమెను పైకి తీయకపోయేసరికి.. స్థానికులు బలవంతంగా వెంటనే బాలుడిని పైకి తీశారు. అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.