KDP: మైదుకూరు మండలం లెక్కల వారి పల్లె విద్యుత్ ఫీడర్‌కు సంబంధించి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పవర్ కట్ ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. ఆయా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలో కరెంటు సప్లై ఉండదని తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించాలని అధికారులు కోరారు. మధ్యాహ్నం పవర్ సప్లై ఉంటుందన్నారు.