KDP: వేముల మండల వ్యాప్తంగా శుక్ర, శనివారాలు కురిసిన వర్షాలకు శెనగ పంట నీట మునిగింది. ఇటీవల సాగుచేసిన శనగ పంటలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమశాతం ఎక్కువైతే శనగ పంట దెబ్బతినే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. ఈ వర్షంతో కొంతమంది రైతులకు మంచి జరిగినా, మరి కొంతమంది రైతులకు నష్టాన్ని మిగిల్చింది.