కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కొబ్బరి కాయల మొక్కు తీర్చుకున్నారు. వీరికి ఆలయ ఈవో స్వాగతం పలకగా.. ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.