RR: పేద ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత భరోసానిచ్చి ఆదుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డుకు చెందిన ఆండాలు అనే మహిళకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదలైన 2 లక్షల 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదన్నారు.