AP: శ్రీ సత్యసాయి శతజయంతి సందర్భంగా మాజీ CM జగన్ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మానవసేవే మాధవసేవ’ అని నమ్మి, అదే తన జీవిత పరమార్థంగా భావించి, అందరికీ ప్రేమనుపంచిన దైవ స్వరూపుడు శ్రీ సత్యసాయి బాబా అని కొనియాడారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, తాగునీరు అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు అని పేర్కొన్నారు.