VKB: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన ధారాసింగ్ జాదవ్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు పార్టీ నేతలకు, ముఖ్యంగా ఎమ్మెల్యేకు ధారాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.