గాజాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో 24 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఐదుగురు హమాస్ సీనియర్ సభ్యులు హతమయ్యారని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.