VKB: బసవేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నిపల్లిలో గల వీరసేవ సమాజం స్థలంలో బసవ మండపాన్ని నిర్మించినట్లు వీరసేవ సమాజం అధ్యక్షుడు అప్ప విజయకుమార్ తెలిపారు. ఆదివారం బసవరాధన కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి, మాజీ సర్పంచ్ బసవరాజ్‌తో కలిసి నిర్మాణాన్ని పరిశీలించారు.