NDL: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు నందికొట్కూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జయసూర్య బాబా చిత్ర పట్టానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మానవతా మూర్తి, సేవకు ప్రతి రూపం, ప్రేమకు రూపం బాబా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బేబి, తదితరులు పాల్గొన్నారు.