KNR: నగరంలోని సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. వినియోగదారులకు త్వరితగతిన అందించాలన్నారు.