W.G: జిల్లాలో అధికారికంగా ఇవాళ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.