పొద్దున లేచిన వెంటనే ఓ గ్లాస్ నీరు తాగాలని వైద్యులు తరచూ చెబుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లు, చన్నీళ్లలో ఏవి బెటర్ అంటే.. వేడి నీళ్లు జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. డిటాక్సిఫికేషన్ చేస్తాయి. అదే చన్నీళ్లు అయితే క్యాలరీలు కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అలాగే రిఫ్రెషింగ్ ఫీల్‌తో పాటు బాడీని హైడ్రేట్ చేస్తాయి. ఇలా అవసరాన్ని బట్టి ఏ నీరైనా తాగొచ్చు.