KDP: నూనె గింజల ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ జేడీ చంద్ర నాయక్ తెలిపారు. శనివారం పులివెందులలోని MPDO కార్యాలయంలో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు ఉచితంగా వేరుశెనగ కాయల సంచులను పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేరుశనగ సాగు చేయాలని రైతులకు సూచించారు. వేరుశనగ పంట సాగు చేసే రైతులకు 50 % సబ్సిడీతో క్రిమిసంహారక మందులు అందిస్తామన్నారు.