E.G: రాజమండ్రి అర్బన్ గోదావరి సబ్ స్టేషన్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ వర్క్స్ కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. సుబ్బారావు పేట, టీటీడీ రోడ్, గాంధీపురం, రాజేంద్రనగర్, ప్రకాశ్ నగర్ ఏరియాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.