అయోధ్య రామాలయం మరో కీలకమైన ఘట్టానికి ముస్తాబవుతోంది. ఈ నెల 25న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లోనే ఆలయ శిఖరంపై మోదీ 191 అడుగుల కాషాయ జెండా ఎగరేయనున్నారు.