ELR: ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం హైస్కూల్లో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్, పోక్సో చట్టాలపై విద్యార్థి దశలో అవగాహన పెంపొందాలన్నారు. ఫోన్లకు బానిస కావద్దని, తెలియని లింకులు ఓపెన్ చేయవద్దన్నారు. ఆఫర్ల పేరుతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, ఓటీపీలు చెప్పడంతో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయన్నారు.