VKB: కొడంగల్ శివారులోని హైవే పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై తవ్విన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. మూడు రోజుల క్రితం ప్యాచ్ వర్క్ కోసం తవ్వి వదిలేయడంతో, హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రాకపోకలు సాగించే వందలాది వాహనాలకు ప్రమాద భయం పట్టుకుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.