KMM: సత్తుపల్లి 18వ వార్డుకు చెందిన సరళ అనారోగ్యంతో మరణించారు. ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ సరళ పార్దివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితోపాటు ఏఎంసీ చైర్మన్ ఆనంద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు ఉన్నారు.