AKP: ఎస్.రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం భగవాన్ శ్రీసత్య సాయిబాబా 100వ జయంతి వేడుకలను నిర్వహించారు. తహశీల్దార్ జే.రమేశ్ బాబు, బాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. సాయిబాబా సమాజానికి చేసిన సేవలను గుర్తించుకోవాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని సేవా భావంతో మెలగాలన్నారు.