WGL: ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యం ఫిబ్రవరి 17, 2026 వరకు కొనసాగనుంది. దాదాపు మూడు నెలలు శుభముహూర్తాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ప్రతిష్ఠాపనలు నిలిచిపోనున్నాయి. రథ సప్తమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి కూడా మౌఢ్యంలో పడటం వల్ల కార్యాలు జరగవు.