CTR: వెంకటగిరికోట మండలంలోని పి.కొత్తూరు గోవింద్ నగర్లో జడ్పీ నిధులతో తాగునీటి ట్యాంకు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన భూమి పూజా కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఇదివరకే ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్, శ్రీనివాసులు, రాజారెడ్డి, రాము, శంకరప్ప పాల్గొన్నారు.