CTR: బీసీ, ఎస్సీ, ఎస్టీలు UPSC ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎస్కే రబ్బానీ బాషా తెలిపారు. జిల్లాలో అర్హత గల బీసీ విద్యార్థులు 25వ తేదీ లోపల అభ్యర్థి బయోడేటాతో పాటు ప్రాథమిక ధ్రువీకరణ పత్రాలను చిత్తూరు బీసీ సంక్షేమ అధికారికి అందించాలని కోరారు.